తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
భారతదేశం, మే 18 -- తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఒకేసారి ఇటు చల్లటి కబురు, అటు హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండగా.. మరోవైపు భానుడు తన ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యాడు. కొన్ని జిల్లాలకు ఏకంగా రెడ్ అలర్ట్ కూడా జారీ అయింది.
ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు (సోమ, మంగళ, బుధ) తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, భద్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.