తెలంగాణపై తుఫాన్ ప్రభావం - ఈనెల 27 నుంచి మళ్లీ వర్షాలు..!
భారతదేశం, అక్టోబర్ 23 -- బంగాళాఖాతంలోని అల్పపీడనం సోమవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇవాళ ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లోని వివిక్త ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది,
తుఫాన్ ప్రభావాన్ని బట్టి వాతావరణ పరిస్థితుల్లో మరిన్ని మార్పులు ఉండొచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో మరిన్ని జిల్లాల్లో కూడా వర్షాలు ఉండొచ్చు.
Published by HT Digital Content Servic...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.