భారతదేశం, అక్టోబర్ 13 -- రాష్ట్రంలో వాతావరణంలో కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఎండల తీవ్రత ఉండగా. మరో రెండు మూడు రోజుల్లో పరిస్థితులు మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది.

ఇవాళ్టి నుంచి అక్టోబర్ 15 ఉదయం 08:30 గంటల వరకు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ 2 రోజుల వ్యవధిలో ఎటువంటి తీవ్రమైన హెచ్చరికలు లేవు. కానీ అక్టోబర్ 15వ తేదీ నుంచి వర్షాలు పడనున్నాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....