భారతదేశం, నవంబర్ 14 -- బంగాళాఖాతంలో మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన సుస్పష్ట అల్పపీడనం శనివారం ఉదయం 8:30 గంటల సమయానికి అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తన తాజా బులెటిన్‌లో వెల్లడించింది.

అమరావతి వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం... ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత మరింత వేగం పుంజుకుని ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ నవంబర్ 16 సాయంత్రం సమయానికి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలు, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ...