భారతదేశం, మే 14 -- Telangana Weather Updates : తెలంగాణలోని భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి. వేసవి తీవ్రత పెరుగుతున్న తరుణంలో భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం రాబోయే నాలుగు రోజులకు సంబంధించి కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగి వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొంది.

మే 14. 15 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక రేపు (మే15) రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఇక భద్రాద్రి కొత్తగూడెం...