భారతదేశం, ఆగస్టు 14 -- జ్యోతిష్య శాస్త్రంలో భోగభాగ్యాలు, సౌందర్యం, ఆకర్షణ, లగ్జరీ జీవితానికి శుక్రుడిని అధిపతిగా పరిగణిస్తారు. శుక్రుడి అనుగ్రహం ఉంటే సమాజంలో పేరుప్రతిష్టలతో పాటు ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. కాగా. సెప్టెంబర్ నెలలో శుక్రుడి గోచారంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. ప్రస్తుతం ఆగస్టు 1 నుంచి కన్యారాశిలో సంచరిస్తున్న శుక్రుడు, సెప్టెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 1:51 గంటలకు తన స్వక్షేత్రమైన తులారాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ వెల్లడించారు.

స్వరాశి అయిన తులా రాశిలో శుక్రుడి ప్రవేశం వల్ల మొత్తం 7 రాశుల వారికి అత్యంత అనుకూల ఫలితాలు దక్కనున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి నవంబర్ 6 వరకు ఈ రాశుల వారి జీవితాల్లో సంతోషం, శాంతి వెల్లివిరుస్తాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఊహించన...