భారతదేశం, నవంబర్ 4 -- మహారాష్ట్రతో ముడిపడి ఉన్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ అంశంపై నిరంతరం సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పనులు ముందుకు తీసుకెళ్లాలన్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు, అక్కడ తలెత్తిన ప్రధాన అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో బ్యారేజీ కారణంగా ఎదురయ్యే ముంపు సమస్యపై పూర్తిస్థాయి వివరాలు, సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

"మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉ...