భారతదేశం, అక్టోబర్ 29 -- ఒడిశా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, అర్నాబ్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది. జిల్లాలోని ప్రధాన నదులైన బాహుదా, నాగావళి, వంశధార నదులు ఉగ్రరూపం దాల్చాయి. బాహుదా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అధికారులు అత్యంత ప్రమాదకరమైన మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

ఒడిశాలోని బాఘలాటి డ్యామ్ నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేయడంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద బాహుదా నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇచ్ఛాపురం వద్ద దాదాపు 75,000 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. వరద ఉధృతి పెరగడంతో ఇచ్ఛాపురం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరి రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. మండలంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడమే కాకుండా, మరో మూడు గ్రామాలు తీవ్ర వరద ముప్పును ఎదుర్కొ...