భారతదేశం, జూన్ 25 -- కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కోట్లాది మంది రైతులకు జీవనాధారమైన తుంగభద్ర జలాశయం చరిత్రలో మరో చారిత్రక ఘట్టం నమోదైంది. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి జలాశయానికి కొత్తగా ఏర్పాటు చేసిన గేట్లను ప్రారంభించారు.

హెలికాప్టర్‌లో కొప్పల్‌లోని ఐఆర్‌బీ హెలిప్యాడ్‌కు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేరుకున్నారు. ఆ తర్వాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్‌తోపాటుగా ముగ్గురు ముఖ్యమంత్రులు తుంగభద్ర డ్యామ్ వద్దకు ఒకే కారులో కలిసి వచ్చారు. తుంగభద్ర డ్యామ్ క్రెస్ట్ గేటు వద్దకు చేరుకున్న ప్రముఖులకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అక్కడి నుండి గేట్ల ప్రారంభోత్సవ స్థలానికి వెళ్ళడానికి ఒక ప్రత్యేక బ్యాటరీతో నడిచే ఓపె...