భారతదేశం, నవంబర్ 3 -- 'మురసు' తీవ్ర తుపాను తుఫాన్ ఇవాళ ఉదయం 5:30 గంటలకు తీరం దాటింది. ఈ తుపానుకు సంబంధించిన వెనుక భాగం (Rear end) తీరం దాటే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

గడిచిన ఆరు గంటల్లో దక్షిణ కోస్తాంధ్రపై కేంద్రీకృతమై ఉన్న ఈ తీవ్ర తుఫాన్.. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-ఉత్తర పశ్చిమ దిశగా పయనించింది. మంగళవారం ఉదయం 8:30 గంటల సమయానికి ఇది అదే ప్రాంతంలో స్థిరపడి ఉంది.

ఈ తీవ్ర తుఫాన్ మరింతగా ఉత్తర - ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ మంగళవారం మధ్యాహ్నానికి క్రమంగా బలహీనపడి సాధారణ తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆ సమయంలో తీరం వెంట గంటకు 90 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆ తర్వాత మంగళవారం అర్ధరాత్రి నాటికి ఇది మరింత బలహీనపడ...