తిరుమల హుండీ ఆదాయంలో ఆల్ టైమ్ రికార్డు... ఒక్కరోజే రూ. 6.93 కోట్లు!
భారతదేశం, సెప్టెంబర్ 11 -- తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం చరిత్రలోనే అరుదైన ఘట్టం నమోదైంది. శ్రీవారి హుండీ కానుకల రూపంలో ఏకంగా రూ. 6.93 కోట్ల ఆదాయం లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చరిత్రలోనే ఒక్క రోజులో ఇంత భారీ మొత్తంలో కానుకలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే ఆరు కోట్లకుపైగా మూడుసార్లు వచ్చాయి.
బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించగా ఈ రికార్డు స్థాయి ఆదాయం తేలింది. కొందరు అజ్ఞాత భక్తులు స్వామివారిపై ఉన్న అపార భక్తితో భారీ మొత్తంలో హుండీ కానుకలు సమర్పించడమే చారిత్రాత్మక రికార్డుకు ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు.
జులై 26, 2012న శ్రీవారి హుండీకి రూ. 5.73 కోట్ల ఆదాయం రాగా, ఆ తర్వాతి కాలంలో ఏప్రిల్ 2018 లో ఒకేరోజు రూ. 6.28 కోట్లు లభించి రికార్డు సృష్టించింది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.