భారతదేశం, సెప్టెంబర్ 23 -- Tirumala Srivari Brahmotsavam 2026 : కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండలవాడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం అత్యంత భక్తిశ్రద్ధల నడుమ, వైభవంగా ముగిశాయి. గత తొమ్మిది రోజులుగా తిరుగిరులను ఆధ్యాత్మిక శోభతో ముంచెత్తిన ఈ ఉత్సవాలకు ముగింపు ఘట్టంగా చివరి రోజు ఉదయం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం (అవభృథం) మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకను కళ్లారా వీక్షించి, పుష్కరిణి జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి విశేష సంఖ్యలో భక్తజనం తిరుమలకు పోటెత్తారు.

చక్రస్నానానికి ముందుగా తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారికి సర్వభూపాలకమైన పల్లకీ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య శ్రీ భూవరాహస్వామివారి ఆలయ ముఖమండపం ప్రా...