తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - 2 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
భారతదేశం, జూలై 5 -- కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో జూలై నెలలో నిర్వహించబోయే విశేష పర్వదినాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దర్శన వేళల్లో, సేవలలో పలు కీలక మార్పులు చేసింది. శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఆణివార ఆస్థానం' కొలువును ఘనంగా నిర్వహించనున్నారు.
దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చే ఈ చారిత్రాత్మక ఉత్సవాన్ని పురస్కరించుకుని, ఆలయ సాంప్రదాయాల ప్రకారం అంతకుముందు వచ్చే మంగళవారం అంటే జూలై 14న 'కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం' (ఆలయ శుద్ధి కార్యక్రమం) జరపనున్నారు.
ఈ రెండు ప్రధాన ఉత్సవాల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన ఇతరులందరికీ జూలై 14, జూలై 17 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. ఇందులో భాగంగా జూలై 13, జూలై 16వ తేదీల్లో వీఐపీ బ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.