భారతదేశం, నవంబర్ 8 -- Tirumala Deepavali Asthanam 2026 : కాంతిమయ పండుగ దీపావళి శుభసందర్భాన్ని పురస్కరించుకుని తిరుమలేశుని సన్నిధిలో దీపావళి ఆస్థాన వేడుకను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ.. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఈ ఉత్సవం నేత్రపర్వంగా సాగింది.

వేడుకల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారితో పాటు ఆలయ సర్వసేనాధిపతి శ్రీ విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను బంగారు వాకిలి వద్ద ఉన్న గరుడాళ్వార్ సన్నిధిలో ప్రత్యేకంగా అమర్చిన సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం స్వామివార్లకు, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, ఆస్థాన నిర్వహణ ప్రక్రియను అర్చకస్వాములు జరిపారు.

ఈ విశేష పర్వదినం సందర్భంగా మూలవిరాట్‌తో పాటు ఉత్సవ మూర్తులకు నూతన పట్టువస్త్రాలను సమర్పిం...