భారతదేశం, నవంబర్ 26 -- తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ఏకంగా 121 కేజీల బంగారు ఆభరణాలను ఓ భక్తుడు కానుకగా అందజేశారు. వీటి విలువ సుమారు రూ.206 కోట్లుగా ఉంటుంది. తన కంపెనీలో 60 శాతం వాటాను విక్రయించడం ద్వారా చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వర్దమాన్ జైన్ ఈ కానుక అందించారు. తన వ్యాపార విజయానికి శ్రీవారి ఆశీస్సులే కారణమని భావించి ఈ భారీ కానుకను సమర్పించారు.

45 ఆభరణాలను 9 సెట్లుగా తయారుచేయించి శ్రీవారికి అందించారు. తిరుమల చరిత్రలో భక్తుడి నుంచి తిరుమలకు అందిన అతిపెద్ద బంగారు కానుకల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఇంతటి భారీ మెుత్తం ఆభరణాలు తిరుమలేశుడికి సీఎం చంద్రబాబు సమక్షంలో వర్దమాన్ జైన్ ఫ్యామిలీ అందించింది.

వర్దమాన్ జైన్ 2025 జనవరిలో స్వామివారికి రూ.6కోట్లు, మేలో ఎలక్ట్రిక్ బస్సులను అందించారు. తాజాగా ఇచ్చిన కానుకలో మూలవిరాట్, ఉత్సవ విగ్రహాలను అలంకరి...