భారతదేశం, జూలై 14 -- TTD BIRRD Trust Donation : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి చెంత మరో భారీ విరాళం నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ రిటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ డిసేబుల్డ్ (BIRRD) ట్రస్ట్‌కు రూ.4.41 కోట్ల విరాళాన్ని సోమవారం అందజేసింది.

శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో సోమవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ పొట్టి వేంకటేశ్వర్లు, సంస్థ డైరెక్టర్లు ఎస్. రాజమౌళి, టి. ప్రసాదరావు, పొట్టి మాలతి లక్ష్మీ కుమారి భక్తిశ్రద్ధలతో ఈ విరాళాన్ని అందజేశారు. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ డీడీలను స్వీకరించారు. దాతల సేవా నిరతిని కొనియాడిన బోర్డు...