భారతదేశం, ఆగస్టు 13 -- తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు, ఉత్తరాంధ్ర - కోస్తా ఆంధ్ర మధ్య ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, పెరిగిన ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు తిరుపతి - విశాఖపట్నం (08509/08510) మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ నిర్ణయంతో సాగర తీర నగరం విశాఖ నుంచి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి రాకపోకలు సాగించే వారికి సీట్ల కొరత సమస్య తీరనుంది. ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 11 వరకు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. ఇరు వైపులా వారానికి రెండు రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం 22 ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు అమర్చారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ల బుకింగ్ ప్రా...