భారతదేశం, జూలై 28 -- శ్రీవారి భక్తి సేవలను తిరుమలాగిరులకే పరిమితం చేయకుండా గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీకారం చుట్టింది. తమ ప్రతిష్ఠాత్మక శ్రీవారి సేవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని గ్రామాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు టీటీడీ ఈవో ఎం.రవిచంద్ర వెల్లడించారు.

తిరుమలలోని శ్రీవారి సేవా సదన్‌లో నిర్వహించిన గ్రూప్ సూపర్‌వైజర్ల శిక్షణా కార్యక్రమ రెండో విడతలో ఈవో రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, ఆధ్యాత్మిక సేవలను మరింత మందికి దరిచేర్చడంతో పాటు భక్తి సేవల ప్రమాణాలను పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50,000 దేవాలయాలు ఉన్నాయని రవిచంద్ర గుర్తుచేశారు. గ్రా...