భారతదేశం, సెప్టెంబర్ 2 -- తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే పవిత్ర భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కీలక అడుగు ముందుకు వేసింది. తిరుమలలో అత్యంత సులభంగా, భద్రంగా లగేజీని పంపిణీ చేసేందుకు గానూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నూతన లగేజీ నిర్వహణ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వహణ విధానంపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఉన్న సుధర్మ సమావేశ మందిరంలో జీఎంఆర్ సంస్థ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు సరికొత్త లగేజీ మేనేజ్‌మెంట్ విధానంపై అదనపు ఈవోకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర వివరణ ఇచ్చారు.

విప్లవాత్మక BLE 5.1 (Bluetooth Low Energy) స...