తిరుమల బ్రహ్మోత్సవాలు : మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు
భారతదేశం, సెప్టెంబర్ 19 -- కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు.
గజరాజులు ముందుగా నడుస్తుండగా, భక్తబృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
మోహినీ రూపంలో స్వామివారి దర్శనం జగత్తును ఆవరించిన మాయామోహాన్ని అధిగమించి భగవంతుని శరణు పొందాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. సర్వమూ భగవంతుని లీలావిలాసమేనని, భక్తి మార్గమే మాయామోహాల నుంచి విముక్తికి దారి చూపుతుందని ఈ అలంకారం చాటిచెబుతోంది.
పౌరా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.