తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సెల్ఫోన్ సిగ్నల్ సమస్యలు రావొద్దు : టీటీడీ
భారతదేశం, సెప్టెంబర్ 8 -- ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని విభాగాలు తమకు అప్పగించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలో సంబంధిత అధికారులతో మ్యూజియం ఏర్పాట్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజియాన్ని పరిశీలించి, ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మ్యూజియంలో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి విభాగం తమకు కేటాయించిన పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసి, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రారంభోత్సవానికి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.