భారతదేశం, ఫిబ్రవరి 23 -- తిరుమలలో దర్శన క్యూలైన్లో మహిళా భక్తురాలికి పాము కాటు అని వివిధ ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా వాస్తవ దూరమని టీటీడీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన శరత్ బాబు, మౌనిక అనే దంపతులు ఆదివారం రాత్రి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు.
ఈ నేపథ్యంలో ట్యాక్సీలో మ్యూజియం సమీపాన ఉన్న ఆర్.బి.సెంటర్ పార్కింగ్ ఏరియాకు చేరుకోగానే మౌనిక తన పాదాలకు పసుపు రాసుకునేందుకు చీకటిలో పక్కనే ఉన్న స్థలంలోకి వెళ్లింది. ఈ క్రమంలో కాలుపై స్పర్శ తగలడంతో భయబ్రాంతులకు లోనైంది. తన భర్త శరత్ ఆ ప్రాంతాన్ని పరిశీలించగా చిన్న పాము కనిపించింది.
వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించే ఎలాంటి పాము కాటు లేదని నిర్ధ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.