భారతదేశం, జూలై 26 -- తిరుమల క్షేత్రంలోని ప్రముఖ పుణ్యతీర్థం జపాలి శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న నీటి కొళాయిలలో తెల్లటి నీరు వస్తోందంటూ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు జోరందుకున్నాయి. ఈ నీటి రంగును చూసి భక్తుల్లో పలు అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దీనిపై పూర్తిస్థాయిలో స్పందించి అధికారిక వివరణ ఇచ్చింది.

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోలను నిశితంగా పరిశీలిస్తే, కొళాయి నుంచి నీరు విడుదలైన కొన్ని సెకన్ల వ్యవధిలోనే అది మళ్లీ తన సహజమైన పారదర్శక రూపాన్ని సంతరించుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. పైప్‌లైన్లలో అధిక నీటి ఒత్తిడి (వాటర్ ప్రెజర్) ఉండటం వల్ల నీటిలో సూక్ష్మమైన గాలి బుడగలు (ఎయిర్ బబుల్స్) ఏర్పడతాయని నీటిపారుదల, సాంకేతిక నిపుణులు వెల్లడించారు. ఈ గాలి బుడగ...