భారతదేశం, అక్టోబర్ 20 -- తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు ఘట్టమైన చక్రస్నానం మంగళవారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామివారి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించగా, వేలాది మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.

చక్రస్నానానికి ముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు శ్రీ భూవరాహస్వామివారి ఆలయ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్వామివారికి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించిన ఈ పవిత్ర క్రతువులో శంఖనిధి, పద్మనిధి, సహ...