భారతదేశం, మే 23 -- వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్‌. వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో క‌లిసి శుక్రవారం సాయంత్రం తిరుమలలోని దర్శన క్యూలైన్లు, ట్రాఫిక్‌, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను త‌నిఖీ చేశారు.

ఈ సందర్భంగా అద‌న‌పు ఈవో భక్తులతో స్వయంగా మాట్లాడి టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం క్యూలైన్లలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ పంపిణీ, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ భక్తుల రద్దీ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీస్‌ శాఖ, టీటీడీ విజిలెన్స్‌, ఇతర విభాగాలు సమన్వయంతో 24x7 పాటు ఆకుంఠిత దీక్ష తో పనిచేస్తున్నాయని చెప...