తిరుమలలో భక్తుల రద్దీ - కంపార్ట్మెంట్లన్నీ ఫుల్, సర్వదర్శనానికి ఎంత సమయమంటే..?
భారతదేశం, జూన్ 29 -- తిరుమల గిరులు భక్తజనసందోహంతో పోటెత్తాయి. వీకెండ్ సెలవు దినాల ప్రభావంతో ఏడుకొండలవాడిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీనితో తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. కంపార్ట్మెంట్లు దాటి వెలుపల ఉన్న క్యూలైన్లలో సైతం భక్తులు కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా వేచి ఉన్నారు.
ప్రస్తుత రద్దీ పరిస్థితుల నేపథ్యంలో.. ఎలాంటి దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం (ధర్మదర్శనం) లభించడానికి దాదాపు 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. లైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.