తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం - హనుమంత వాహనంపై కోదండరాముడిగా శ్రీ మలయప్ప!
భారతదేశం, అక్టోబర్ 17 -- Tirumala Navaratri Brahmotsavam 2026 : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఆరో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు కోదండ రాముని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుస్సు, బాణాలు ధరించి, తన పరమభక్తుడైన హనుమంతునిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. భక్తజనుల గోవింద నామస్మరణలతో మాడ వీధులు మారుమోగిపోయాయి.
వాహనసేవ ముందర వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలు, జానపద నృత్యాలతో స్వామివారిని కీర్తించారు. మంగళవాయిద్యాల దివ్య మంగళ ధ్వనుల నడుమ వాహన సేవ కోలాహలంగా సాగింది. మాడ వీధుల్లో వేచి ఉన్న వేలాది మంది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుని తారకమంత్ర స్మరణ చేశారు.
శ్రీవారి వాహనసే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.