భారతదేశం, ఆగస్టు 17 -- కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చే అమాయక భక్తులను మోసగిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న దళారీ ముఠా కుట్రను టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు చాకచక్యంగా భగ్నం చేశారు. నకిలీ గుర్తింపు పత్రాలను సృష్టించి వేరొకరి పేర్లతో సీఆర్వో (CRO) కార్యాలయం వద్ద వసతి గదులు పొందుతూ, వాటిని భక్తులకు అధిక ధరలకు అమ్ముకుంటున్న ఘరానా దందాను అధికారులు గుట్టురట్టు చేశారు.

ఆగస్టు 16న జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే... అప్పటికే ఒక గదిని పొందిన ఒక వ్యక్తి, మరో నకిలీ గుర్తింపు కార్డుతో మళ్లీ గది కోసం క్యూ లైన్‌లో నిలబడ్డాడు. అతడి అనుమానాస్పద కదలికలను గమనించిన సీఆర్వో కార్యాలయ సిబ్బంది వెంటనే అలర్ట్ అయి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు.

అదుపులోకి తీసుకున్న వ...