తిరుమలలో కారీరిష్టి, వరుణయాగం - ఈనెల 30 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు! సెప్టెంబర్ 3 వరకు షెడ్యూల్ ఇదే
భారతదేశం, ఆగస్టు 29 -- Varuna Yagam Tirumala : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశమంతా సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మహత్తర సంకల్పాన్ని చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తూ ప్రత్యేక ఆధ్యాత్మిక క్రతువులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు తిరుమలలో వరుణయాగ, పర్జన్యశాంతి సహిత కారీరిష్టి యాగాలను వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
తిరుమలలోని ప్రశాంత వాతావరణంలో నెలకొన్న ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం వేదికగా ఈ ప్రత్యేక యాగ ప్రక్రియలన్నీ కొనసాగుతాయి. మొత్తం 32 మంది ప్రముఖ వేద, శ్రౌత, స్మార్త పండితులు అత్యంత నిష్ఠతో ఈ యాగ కార్యక్రమాల్లో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.