తిరుమల, చంద్రగిరి పరిసరాల్లో ఏనుగుల సంచారం.. అప్రమత్తమైన అటవీశాఖ
భారతదేశం, ఆగస్టు 30 -- తిరుమల-తిరుపతి పుణ్యక్షేత్రాలను అనుసంధానించే అత్యంత కీలకమైన శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం స్థానిక ప్రజలను, భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. శేషాచలం అడవుల్లో తిరుగుతున్న ఒక భారీ ఏనుగుల మంద ఒక్కసారిగా రెండు గుంపులుగా విడిపోవడంతో అటవీ శాఖ అధికారులు అత్యంత అప్రమత్తమయ్యారు. ప్రశాంతంగా ఉండే అటవీ సరిహద్దు గ్రామాలు ఇప్పుడు గజరాజుల రాకతో భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నాయి.
అటవీ శాఖ అధికారులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, శేషాచలం అడవుల నుంచి బయలుదేరిన ఏనుగుల గుంపు రెండు వేర్వేరు మార్గాల్లో పయనిస్తోంది.
భాకరాపేట, దిగువూరు ప్రాంతాల మీదుగా సుమారు 13 ఏనుగులతో కూడిన ఒక గుంపు చంద్రగిరి వైపునకు వేగంగా కదులుతోంది. ఈ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ పొలాలు, జనవాసాలకు సమీపంలో ఇవి సంచరిస్తుండటంతో స్థానిక రైతులు, నివాసితుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.