భారతదేశం, మే 21 -- South Central Railway Special Trains : రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో అప్డేట్ ఇచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణించే వారి అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి వన్-వే ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకువచేలా నిర్ణయం తీసుకుంది.

ఈ పొడిగింపు నిర్ణయం ద్వారా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని పలు ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారికి ఎంతో ఉపశమనం కలగనుంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఈ వన్-వే ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్, స్టాపింగులు, సమయాల వివరాలను దక్షిణ మధ్య రైల్వే ...