భారతదేశం, మే 14 -- తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో విస్తృత స్థాయిలో వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన, అన్నప్రసాదం, వైద్య తదితర సౌకర్యాలను టీటీడి అందుబాటులో ఉంచింది.

భక్తుల కోసం తిరుపతిలో శ్రీనివాసం, విష్ణునివాసం, మాధవం, ఎస్వీ గెస్ట్ హౌస్, పద్మావతీ గెస్ట్ హౌస్, తిరుచానూరు తోళ్లప్ప గార్డెన్స్ వంటి వసతి సముదాయాలను టీటీడీ నిర్వహిస్తోంది. వీటితో పాటు డార్మిటరీలు, ఉచిత లాకర్లు, మరుగుదొడ్లు, స్నాన గదులు, ప్రథమ చికిత్స కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఏసీ గదులను ఆన్‌లైన్, రొటేషన్ విధానంలో భక్తులకు కేటాయిస్తున్నారు. నాన్ ఏసీ గదులను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన కేటాయిస్తున్నారు.

2011లో ప్రారంభించిన విష్ణునివాసంలో 408 గదులు, 09 ...