భారతదేశం, మార్చి 31 -- హీరో కిరణ్ అబ్బవరం, తెలుగు అందం శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని బేబీ డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ కథ అందించిన ఈ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహించారు. తాజాగా జరిగిన గుర్తుందా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు, నిర్మాత సాయి రాజేష్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

దర్శక నిర్మాత సాయి రాజేశ్ మాట్లాడుతూ.. "బేబి మూవీ విజయం తర్వాత మేము డబ్బుల వెనక పరుగు పెట్టలేదు. ఒక మంచి కథతో మళ్లీ మూవీ చేయాలని అనుకున్నాం. నా మనసుకు నచ్చిన ఒక కథను రాసుకున్నాను" అని అన్నారు.

"కథ రచయిత దగ్గర నుంచి దర్శకుడి దగ్గరకు వెళ్లి స్క్రీన్ మీదకు వచ్చేసరికి అందులోని ఒరిజినాలిటీ ఎంతో కొంత పోతుంది. కానీ, ఈ సినిమాను నేను అనుకున్నదాని కంటే బాగా తెరకెక్కించాడు రవి నంబూరి" ...