భారతదేశం, ఆగస్టు 28 -- తమిళనాడులో మద్యం విక్రయాలు చేపట్టే ప్రభుత్వ సంస్థ 'టాస్మాక్' (TASMAC) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రీటైల్ మద్యం దుకాణాల స్టాక్ ఇండెంట్ (ఆర్డర్) ప్రక్రియను సెప్టెంబర్ 1 నుంచి పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నట్లు ప్రకటించింది. పాత కాగితాల పద్ధతికి స్వస్తి పలికి, డిజిటల్ విధానం ద్వారా పరిమితులకు లోబడి ఆర్డర్లు తీసుకునేలా చర్యలు చేపట్టారు.

కొత్త విధానంలో భాగంగా షాపు సూపర్వైజర్లు తమ వద్ద ఉండే ప్రత్యేక హ్యాండ్ హెల్డ్ పరికరాల ద్వారానే స్టాక్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. "స్థానిక అమ్మకాలు, డిమాండ్‌కు అనుగుణంగా వినియోగదారులకు కావలసిన బ్రాండ్లను నిరంతరాయంగా అందించడానికే ఈ మార్పులు చేశాం" అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.

టాస్మాక్ మేనేజింగ్ డైరెక్టర్ కే నందకుమార్ ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. 2025 నా...