తమిళనాడులో భారీ వర్షాలు - పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..! దక్షిణాది రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు
భారతదేశం, అక్టోబర్ 21 -- బంగాళాఖాతంలోర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్రరూపం దాల్చుతుండటంతో తమిళనాడు వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ(అక్టోబర్ 21) రాష్ట్రంలోని నాలుగు ప్రధాన జిల్లాల్లో పాఠశాలలకు ముందస్తుగా సెలవు ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చెన్నైతో పాటు దాని పొరుగు జిల్లాలైన తిరువళ్లూర్, చెంగల్పట్టు, కాంచీపురంలలోని పాఠశాలలన్నింటికీ ఈ నిర్ణయం వర్తిస్తుంది.
రాబోయే 24 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించడంతో.. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ ఆదేశాలు జారీ చేశారు.
నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్రమై అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం బులిటెన్ విడుదల చేసింది. ఈ ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.