భారతదేశం, అక్టోబర్ 6 -- దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA) ప్రయాణికులకు ఊరటనిచ్చేలా కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఒక టెర్మినల్ నుంచి మరొక టెర్మినల్‌కు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులను తొలగిస్తూ రూ.3,500 కోట్ల వ్యయంతో డ్రైవర్‌లెస్ రైలు వ్యవస్థను (Automated People Mover - APM) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2030 నాటికి అందుబాటులోకి రానున్న ఈ డ్రైవర్‌లెస్ ట్రాన్సిట్ సిస్టమ్ ద్వారా టెర్మినల్-1 (T1) నుంచి టెర్మినల్-3 (T3)కి ప్రయాణ సమయం కేవలం 13 నిమిషాలకు తగ్గనుంది.

ప్రస్తుతం T2, T3 టెర్మినళ్లు పక్కపక్కనే ఉన్నప్పటికీ, T1 టెర్మినల్ మాత్రం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో విమానాలు మారే ప్రయాణికులు ప్రస్తుతం రోడ్డు మార్గంలో బస్సులు లేదా క్యాబ్‌ల ద్వారా వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కారానిక...