భారతదేశం, జూన్ 6 -- ఢిల్లీ వ్యాప్తంగా శనివారం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. డిజిటల్ గ్రూప్ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నిరసన పిలుపునివ్వడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI), జంతర్ మంతర్, సరిహద్దు ప్రాంతాలతో పాటు కీలక కూడళ్ల వద్ద అదనపు బలగాలను మోహరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వెయ్యి మందికి పైగా పోలీసులను రంగంలోకి దించారు.

ఈ నిరసన కార్యక్రమానికి నిరసనకారులు ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. "వారు అనుమతి కోరినప్పుడు ఆ విజ్ఞప్తిని పరిశీలిస్తాం" అని ఒక సీనియర్ పోలీస్ అధికారి పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు.

సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారాన్ని బట్టి పోలీసులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వెలుపల బారికేడ్లను ఏర్పాటు చేశారు....