భారతదేశం, అక్టోబర్ 16 -- దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వేదికగా తలపెట్టిన 'లహెరా దో తిరంగా' కార్యక్రమానికి బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 16న సాయంత్రం 5 గంటలకు కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్ వద్ద ఈ నిరసన ప్రదర్శన నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ ప్రదర్శన వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని, ప్రజా భద్రతతో పాటు స్థానిక వ్యాపారులు, వాహనదారులకు ఇబ్బందులు కలుగుతాయని పేర్కొంటూ కార్యక్రమాన్ని విరమించుకోవాలని ఢిల్లీ పోలీసులు అంతకుముందే దీప్కేకు స్పష్టం చేశారు.

ఎన్సీపీ-ఎస్సీపీ ప్రతినిధి అనీష్ గవాండే నివాసం నుంచి బయటకు వస్తున్న సమయంలో దీప్కేను పోలీసులు అడ్డుకున్నారు. "కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో సెక్షన్ 163 (గతంలో సెక్షన్ 144) అమల్లో ఉంది. అందుకే ...