భారతదేశం, అక్టోబర్ 15 -- స్వదేశీ మానవరహిత వైమానిక వాహనాల (యూఏవీ) తయారీ రంగంలో హైదరాబాద్‌కే చెందిన ప్రముఖ సంస్థ డ్రోగో ఏరోస్పేస్ మరో కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన 'జేకే 250ఈ' ఫిక్స్డ్-వింగ్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (వీటీఓఎల్) డ్రోన్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారికంగా 'టైప్ సర్టిఫికేషన్' మంజూరు చేసింది. ఈ తాజా గుర్తింపుతో డ్రోగో ఏరోస్పేస్ ఇప్పటివరకు సాధించిన డీజీసీఏ టైప్ సర్టిఫికేషన్ల సంఖ్య ఏకంగా ఆరుకు చేరుకోవడం విశేషం.

హైబ్రిడ్ ఫిక్స్డ్-వింగ్, మల్టీ-రోటర్ కాన్ఫిగరేషన్‌తో రూపుదిద్దుకున్న యూఏవీలలో.. డ్రోన్ ఆపరేటర్ల శిక్షణ ప్రయోజనాల కోసం డీజీసీఏ టైప్ సర్టిఫికేషన్ పొందిన దేశంలోనే మొట్టమొదటి డ్రోన్‌గా 'జేకే 250ఈ' చరిత్ర సృష్టించిందని సంస్థ సీఈఓ యశ్వంత్ బొంతు వెల...