భారతదేశం, సెప్టెంబర్ 10 -- హైదరాబాద్ నగరంలో రాత్రింబవళ్లు శ్రమిస్తూ నగర ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములవుతున్న గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల (డెలివరీ బాయ్స్) కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెలివరీ భాగస్వాములు విశ్రాంతి తీసుకోవడానికి, ప్రాథమిక వసతులు పొందడానికి వీలుగా నగరంలో 'ప్రగతి కేంద్రాలను' ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం,ఆన్‌లైన్ గ్రోసరీ డెలివరీ యాప్‌ జెప్టోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

రోజంతా రోడ్లపై తిరుగుతూ సేవలందించే డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న మౌలిక వసతుల లేమిని అధిగమించేందుకు ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. 2024లో హైదరాబాద్‌లోని 166 మంది గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులపై హీట్‌వాచ్ నిర్వహించిన సర్వే సంచలన విషయాలను వెల్లడించింది.

నగరంలో దాదాపు 69 శాతం మంది గిగ్ వర్కర్లకు పరిశుభ్రమైన టాయిలెట్స్ సౌకర్యం అందుబ...