భారతదేశం, జూలై 4 -- సాధారణంగా పెట్టుబడుల్లో స్థిరత్వం, సురక్షితమైన రాబడి కోసం చాలామంది డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ వైపు మొగ్గు చూపుతారు. వీటిలో ఈక్విటీల తరహాలో భారీ లాభాలు రాకపోయినా, నష్టభయం తక్కువగా ఉంటుంది. అయితే, కొన్ని డెట్ ఫండ్స్ మాత్రం దీర్ఘకాలంలో ఈక్విటీలను తలపించేలా అద్భుతమైన ఎస్ఐపీ (SIP) రిటర్న్స్ ఇచ్చి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచాయి. కానీ, ఇలాంటి నిలకడైన ప్రదర్శన చేసిన ఫండ్స్ సంఖ్య వేళ్ల మీద లెక్కించదగిన స్థాయిలోనే ఉంది.

వ్యాల్యూ రీసెర్చ్ జూలై 4, 2026 నాటి గణాంకాలను పరిశీలిస్తే, గత 10 ఏళ్ల కాలంలో 10 శాతానికి పైగా వార్షిక ఎస్ఐపీ రిటర్న్స్ అందించిన డెట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు కేవలం నాలుగే ఉన్నాయి. కనీసం 8 శాతం రిటర్న్స్ పరిమితిని లెక్కలోకి తీసుకున్నా, ఆ జాబితాలో కేవలం తొమ్మిది స్కీమ్‌లు మాత్రమే నిలిచాయి. స్వల్పకాలంలో మంచి రిటర్న్స్ సా...