డీలిమిటేషన్ బిల్లు : రేపు ఢిల్లీలో 'దక్షిణాది' కాంగ్రెస్ సీఎంల భేటీ - చర్చల తర్వాత నిర్ణయం..!
భారతదేశం, నవంబర్ 28 -- లోక్సభ, శాసనసభ సీట్లను 50 శాతం పెంచే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై చర్చించేందుకు నవంబర్ 29న ఢిల్లీలో తెలంగాణ, కేరళ ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు, ప్రతిపాదిత సీట్ల పెంపు వల్ల దక్షిణాది రాష్ట్రాలపై పడే ప్రభావంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తామని చెప్పారు. పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యం, రాజకీయ బలంపై ఈ మార్పులు చూపే పరిణామాలను విశ్లేషిస్తామని వివరించారు.
ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో లోక్సభ సీట్ల కేటాయింపు, శాసనసభల బలాన్ని 50 శాతం పెంచి, మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్రం కొత్త రాజ్యాంగ సవరణ బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. సోమవారం లోక్సభ ముందుకు రానున్న రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.