భారతదేశం, నవంబర్ 28 -- మహిళా కోటాతో ముడిపడిన డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ఉమ్మడిగా వ్యతిరేకించాలని ఇండియా కూటమి నేతలు శనివారం నిర్ణయించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శాశ్వతంగా అధికారంలో కొనసాగడానికి, దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి ఈ బిల్లును తెస్తున్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.

న్యూఢిల్లీలో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లతో రెండు గంటల సమావేశం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. పెరిగిన జనాభాకు తగ్గట్టు ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెరగనందున ఈ డీలిమిటేషన్ బిల్లు ఆ వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకమని ఆయన అన్నారు. ఈ బిల్లు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని ఖర్గే విమర్శించారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ '400 దాటాలి' నినాదం ఇచ్చారని, ఇప్పుడు ఈ బిల్లు ద్వారా '800 దాటాాలి' అ...