డీలిమిటేషన్ బిల్లుకు వైఎస్ఆర్సీపీ మద్దతు.. కానీ ఒక షరతు
భారతదేశం, నవంబర్ 27 -- పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వేళ జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్సభ స్థానాలను 850కి పెంచేందుకు ఉద్దేశించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రక్రియలో ప్రాంతీయ సమతుల్యతను కచ్చితంగా కాపాడాలనే షరతును ఆ పార్టీ వర్గాలు ముందుంచుతున్నాయి. నవంబర్ 27న ఏఎన్ఐ వార్తా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.
సాధారణంగా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళన మొదటి నుంచీ ఉంది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో కీలక సంఖ్యాబలం ఉన్న వైఎస్ఆర్సీపీ వైఖరి ప్రాధాన్యత సంతరించుకుంది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.