భారతదేశం, నవంబర్ 28 -- వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి డీలిమిటేషన్‌పై మాట్లాడారు. హిందుస్థాన్ టైమ్స్‌తో జరిగిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. తాము గతంలో బీజేపీని, ఎన్నికల నిర్వహణ తీరును విమర్శించామని గుర్తుచేశారు. అలాగే ఈవీఎంల(EVMs) విషయంలో కూడా ఆందోళనలు వ్యక్తం చేశామని పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పిన సమాధానాలు చూడండి.

గతసారి మేం బిల్లుకు అనుకూలంగానే ఓటు వేశాం. సీట్ల సంఖ్యలో 50 శాతం దామాషా పద్ధతిలో పెరుగుదల ఉండటమే అందుకు కారణం. కేంద్రం మాకు ఈ మేరకు హామీ ఇచ్చింది. ఈసారి దానిని బిల్లులో చేర్చారు. సూత్రప్రాయంగా మాకు దీనిపై అభ్యంతరం లేదు, అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తాలనుకుంటున్నాం. దీనివల్ల ప్రాంతీయ అసమానతలు మరింత పెరగకూడదు.

ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది మహిళా రిజర్వేషన్లు, దీనికి మేం ఎప్పుడూ మద్దతు ...