భారతదేశం, సెప్టెంబర్ 21 -- రద్దీ సమయాల్లో ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే(SCR) కీలక నిర్ణయం తీసుకుంది. దసరా, దీపావళి తదితర పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని అధిగమించడానికి చర్లపల్లి - సెంగోట్టై, అలహాబాద్ ప్రయాగ్‌రాజ్ - చర్లపల్లి మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన చర్లపల్లి టెర్మినస్ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు ప్రారంభం అవుతాయి.

చర్లపల్లి - సెంగోట్టై - చర్లపల్లి స్పెషల్ ట్రైన్స్ మొత్తం 18 సర్వీసులు నడుస్తాయి. తమిళనాడులోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం చర్లపల్లి - సెంగోట్టై మధ్య వారానికి ఒకరోజు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది.

రైలు నంబరు 07191 (చర్లపల్లి - సెంగో...