డిసెంబర్ మెుదటి వారం నుంచి రేషన్ షాపుల్లో కందిపప్పు, పామాయిల్.. ధరలు తెలుసుకోండి!
భారతదేశం, నవంబర్ 25 -- పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల నుంచి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరలకే కందిపప్పు, పామాయిల్‌ను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
సచివాలయంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్‌లో ధరల కట్టడి, సరుకుల లభ్యత, భవిష్యత్ కార్యాచరణపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. వినియోగదారులపై ధరల భారం పడకుండా చూసేందుకు ప్రభుత్వం డిసెంబర్ మెుదటివారం నుంచే కందిపప్పు, పామాయిల్ అందించనుంది. రేషన్ దుకాణాల ద్వారా కిలో కందిపప్పు రూ.100కు, లీటర్ పామాయిల్ రూ.125కి అందించాలని చంద్రబాబు ఆదేశించారు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.