భారతదేశం, ఆగస్టు 6 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరాలనుకునే వైద్య విద్యార్థులకు బిగ్ అప్‌డేట్. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2026-27 విద్యాసంవత్సరానికి గాను యూజీ మెడికల్ యాజమాన్య/కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.

యూనివర్సిటీ అనుబంధ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ఉన్న కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లతో పాటు తిరుపతిలోని 'శ్రీ పద్మావతి మహిళా మెడికల్ కళాశాల (SVIMS)'లో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2026)లో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ...