భారతదేశం, మార్చి 5 -- వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపింది. ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలను ఈ వారమే 15 శాతానికి పెంచనున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించిన వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

నిజానికి, గత నెలలో (ఫిబ్రవరి 20న) అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద గండం సృష్టించింది. అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద ట్రంప్ ఏకపక్షంగా విధించిన సుంకాలు చెల్లవని 6-3 మెజారిటీతో తీర్పునిచ్చింది. అయితే, ట్రంప్ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కోర్టు తీర్పు వచ్చిన కొద్ది గంటల్లోనే మరో చట్టం ద్వారా 10 శాతం సుంకాన్ని విధిస్తూ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇప్పుడు ఆ 10 శాతాన్న...