భారతదేశం, ఆగస్టు 24 -- భారత్‌ను 'డయాబెటిస్ రాజధాని'గా మారుస్తున్న టైప్-2 మధుమేహం తీవ్రరూపం దాల్చుతోంది. సకాలంలో వ్యాధిని గుర్తించడం, సైన్స్ ఆధారిత నాణ్యమైన చికిత్సను అందించడం ద్వారా మాత్రమే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి రోగులను కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రస్తుతం మనదేశంలో 10 కోట్ల మందికి పైగా వయోజనులు డయాబెటిస్‌తో జీవిస్తున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరుతుందని అంచనాలు చెబుతున్నాయి. పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే భారతీయుల్లో దాదాపు 10 సంవత్సరాల ముందే టైప్-2 డయాబెటిస్ వెలుగుచూస్తోంది. ఇది శరీరంలో చాలా వేగంగా విస్తరిస్తూ, గుండె జబ్బులు, దీర్ఘకాలిక మూత్రపిండాల (కిడ్నీ) వ్యాధుల ముప్పును పెంచుతోంది. మనదేశంలో డయాబెటిస్ ఉన్న ప్రతి పది మందిలో ఒక్కరు మాత్రమే రక్తంలో చక్కెర స్థాయిలను నిర్దేశిత లక్ష్యానికి అను...